సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానము నందు మజ్జిగ చలివేంద్రమును నేడు, ఆదివారం ఉదయం స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కుమారుడు, గ్రంధి రవితేజ్ చేతులు మీదుగా ప్రారంభించడమైనది. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమద్దిరాల మల్లిఖార్జున శర్మ పూజాధికార్యక్రమములు నిర్వహించారు. ఈ మజ్జిగ చలివేంద్రంకు దాతగా రావాడ రామోహ్మనరావు వరలక్ష్మీ దంపతులు, విజయకిరణ్ బయోటెక్ భీమవరం వారి సహాకారంతో దేవస్థానము వారు నిర్వహిస్తున్నారు. మండు వేసవిలో శ్రీ అమ్మవారి కరుణతో దేవాలయ ఆవరణ వైపు వెళ్లే వారి దాహార్తిని ఉచితంగా చల్లటి మజ్జిగ తో తీర్చే సంప్రదాయం ఈ ఏడాది కూడా దాతల సహకారంతో నిర్వహిస్తున్నారు. ఈ కార్యాక్రమములో ఆలయ సహాయ కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారి యర్రంశెట్టి భద్రాజీ, ఆలయ ఛైర్మన్ మానేపల్లి నాగేశ్వరరావు, ధర్మకర్తల మండలి సభ్యులు రామాయణం సత్యనారాయణ, ముత్యాల వెంకట రామారావు, మావూరి సుందరరావు, బాగ్యలక్ష్మి కె. వెంకటలక్ష్మి జి. విజయలక్ష్మి, మరియు భక్తులు పాల్గొన్నారు. .
