సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం నందు నేడు, మంగళవారం హుండీలు తెరచి లెక్కించగా వచ్చిన ఆదాయము ( 52 రోజులకు భక్తులు సమర్పించిన కానుకలు ) క్రింది విధముగా వచ్చినది.
1)నగదు+చిల్లర –45,00,873(నలబై ఐదు లక్షల ఎనిమిది వందల డబ్బై మూడు రూపాయలు )
2) బంగారం – 55గ్రా-200మి.గ్రా
3)వెండి -208గ్రా-500మి.గ్రా
మరియు విదేశీ కరెన్సీ 11 నోట్స్ వచ్చాయని ఈ కార్యక్రమం లో దేవాలయ ధర్మ కర్తల మండలి సభ్యులు చైర్మెన్ మానేపల్లి నాగన్న , దేవాలయ సిబ్బంది పాల్గొన్నట్లు దేవాలయ సహాయ కమిషనర్ యర్రంశెట్టి భద్రజీ ప్రకటించారు,
