సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారిని నేడు, శనివారం దర్శించుకున్న స్థానిక భక్తులు కే శ్రీనివాస రోహిత్ 6 గ్రాముల బంగారం మరియు మరో స్థానిక భక్తుడు అచ్చుత రామరాజు 2 గ్రాముల బంగారం అమ్మవారికి కానుకగా అందజేశారు. వీరికి ఆలయ అర్చకులు పూజలు నిర్వహించారు. ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం ప్రసాదాలు అందజేశారు. దసరా మహోత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో దేవాలయంలో పూజ, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు , వేలాది మంది భక్తులకు దర్శన ఏర్పాట్లకు ముందస్తు కార్యాచరణ జరుగుతుంది.
