సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: 60వ వార్షికోత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో .. భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ శ్రీ అమ్మవారిని, దేవాలయాన్ని నూతన రంగులతో అలంకరించుటలో భాగంగా రేపటి శనివారం నుండి అంటే ది. 9.12.2023 ఉదయం గం. 10.30 ని.లకు కళాపకర్షణ కార్యక్రమమును ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ శ్రీ మద్దిరాల మల్లిఖార్జున శర్మ , బ్రహ్మశ్రీ తంగిరాల దత్తత్రేయ శర్మ వార్ల ఆద్వర్యములో నిర్వహించిన తదనంతరము శ్రీ అమ్మవారి మూలవిరాట్ దర్శనము తాత్కాలికముగా నిలుపుదల చేయబడును. అయితే దర్శనం కోసం వచ్చే భక్తులను శ్రీమావుళ్ళమ్మ అమ్మవారి ఉత్సవమూర్తి ని దర్శించుకోవచ్చను. గర్భాలయం చుట్టూ ఉండే ప్రదిక్షణ మండపం వెనుక యదావిధిగా పూర్వము వలె భక్తులను ఉత్సవ మూర్తి దర్శనానికి అనుమతిస్తారు. శ్రీ అమ్మవారి మూలవిరాట్ దర్శనం తిరిగి ది. 28.12.2023, గురువారం ఉదయం గం. 11.00 లకు కళాన్యానము అనంతరము శ్రీ అమ్మవారి మూలవిరాట్ దర్శనానికి భక్తులను అనుమతిస్తారు అని సదరు విషయమును ఆలయ సహాయ కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారి. యర్రంశెట్టి భద్రాజీ , ఆలయ చైర్మన్ మానేపల్లి నాగేశ్వరరావు మరియు ధర్మకర్తల మండలి సభ్యులు ప్రకటించారు.. file photo
