సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్దానము, ది 09-01-2024.. నేడు మంగళవారం. హుండీ తెరచి భక్తులు గత 40 రోజులకు శ్రీ అమ్మవారికి సమర్పించిన కానుకలు లెక్కించగా వచ్చిన మొత్తం ఆదాయం రూ. 27,47,385.00 .. అక్షరాల ఇరవై ఏడు లక్షల,నలభై ఏడువేల,మూడు వందల ఎనభై ఐదు రూపాయలు. భక్తులు హుండీ ద్వారా, బంగారం 64.గ్రా 600 మి గ్రాములు.వెండి 153గ్రా .700 మి.గ్రాములు సమర్పించుకున్నారు.ఈ యొక్క లెక్కింపు కార్యక్రమంలో ధర్మకర్తల మండలి చైర్మన్ మానేపల్లి నాగేశ్వరరావు, మరియు ధర్మ కర్తలు: ముత్యాల వెంకట రామారావు, చెల్లంకి నాగ శేషగిరి, మావూరి సుందరరావు, రామాయణం సత్యనారాయణ. గోపిశెట్టి విజయలక్ష్మి, కోయ వెంకట లక్ష్మీ , నీలాపు విజయ నాగలక్ష్మి, తనిఖీదారులు వి వెంకటేశ్వరరావు, కర్రీ శ్రీనివాస్ రావు, దండు కృష్ణంరాజు,ఆలయ సిబ్బంది పాల్గొన్నరని ఆలయ సహాయ కమీషనర్ మరియు కార్యనిర్వహణదికారి యర్రంశెట్టి భద్రాజీ తెలిపారు.
