సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని నేడు శుక్రవారం ఉదయం దర్శించుకున్న కర్నూల్ కి చెందిన R సౌమ్య రెడ్డి అనే మహిళా భక్తురాలు శ్రీ అమ్మవారికి 300 గ్రాముల వెండి కుందులు కానుకగా సమర్పించారు.ఆలయ ఉపప్రధాన అర్చకులు కొప్పేశ్వరరావు వీరికి పూజలు నిర్వహించారు. ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి బుద్ధ మహాలక్ష్మి నగేష్ ప్రసాదాలు, ఫోటో వీరికి అందజెయ్యడం జరిగింది. నేడు శుక్రవారం కూడా కావడంతో శ్రీ అమ్మవారి దర్సనానికి విశేషంగా వచ్చిన మహిళా భక్తులతో ఎర్రటి ఎండలో సైతం ఆలయం ఆవరణ సందడిగా ఉంది.
