సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని నేడు, సోమవారం ఉదయం దర్శించుకున్న నెల్లూరు కి చెందిన పి వంశీకృష్ణ, రమా దంపతులు శ్రీ అమ్మవారికి కానుకగా 6 గ్రాముల బంగారం కానుకగా అందజేశారు. వీరికి ఆలయ ఉప ప్రధాన అర్చకులు కొప్పేశ్వరరావు వీరికి పూజలు నిర్వహించారని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు. ఇటీవల కాలంలో శ్రీ అమ్మవారికిస్థానికులతో పాటు దూరప్రాంతాలకు చెందిన శ్రీ అమ్మవారి భక్తులు ఎక్కువగా విశేష కానుకలు సమర్పించడం గమనార్హం.
