సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకొన్న స్థానిక భక్తులు చెందిన అల్లూరి మనోజ్ వర్మ నాగశృతి దంపతులు శ్రీ అమ్మవారికి కానుకగా 8 గ్రాముల బంగారం అందజేశారు. వీరికి ఆలయ అర్చకులు పూజలు నిర్వహించారు ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ ప్రసాదం శేషవస్త్రం ఫోటో అందజేశారు. ఈనెల 21 వ తేదీ ఆదివారం ఆషాడ శుద్ధ పౌర్ణమి సందర్భముగా శ్రీ మావుళ్ళమ్మవారు ఆకులూ.. కాయగూరలుపండ్ల తో శ్రీ శాఖంబరిదేవి అవతారంలో దర్శనమివ్వనున్నారు.
