సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్; భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఉత్సవాలకు చలువ పందిళ్ళ ఏర్పాటు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. శ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయంలో నేడు, శుక్రవారం గొల్లవానితిప్ప కి చెందిన శ్రీ కొప్పర్తి వెంకట సత్యనారాయణ నాగరాణి దంపతులు 8 గ్రాముల బంగారం ( ఫై చిత్రంలో)మరియు హైదరాబాద్ కి చెందిన ఎన్ ప్రశాంత్ నాయుడు రెండు గ్రాముల బంగారం కానుకలు గా అందజేశారు. .ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ వీరికి పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందజెయ్యగా .ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ వారికీ ప్రసాదాలు శేషవస్త్రం అందించారు.
