సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: పవిత్ర కార్తీక మాసం నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల నుండి ఎంతో మంది భక్తులు భీమవరం పంచా రామం తో పాటు భీమవరం శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయాన్ని కూడా దర్శించుకొంటున్నారు. చంద్ర గ్రహణం తదుపరి సంప్రోక్షణ అనంతరం నేడు, బుధవారం ఉదయం నుండి భక్తులకు దర్శనం కల్పించారు. శ్రీ అమ్మవారి ఆలయం నందు సుమారు 140 మంది భక్తులు శ్రీ మావుళ్ళమ్మ వారి పాద మండల దీక్ష ధరించారు . వీరిచే ఈ ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ మద్దిరాల మల్లిఖార్జున శర్మ దీక్షను ధరింప చేసారు.
