సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వర్షాలు వరదల నేపథ్యంలో భీమవరం పట్టణంలో గతంలో స్థాయిలో కాకపోయిన ఈసారి పలు ప్రాంతాలలో ఏర్పాటు చేసిన భారీ వినాయక పందిళ్ళలో యువత 9 రోజులు కు బదులుగా చాల ప్రాంతాలలో 5 రాత్రుల లేదా7 రోజుల ఉత్సవాల ముగింపు చేస్తున్నారు. తదుపరి నిన్న నేడు, శుక్రవారం పందిళ్ళలో అన్నసమారాధనలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వినాయక చవితి ఉత్సవాల ముగింపు సంధర్భంగా స్థానిక గునుపూడి స్థూపం సెంటర్ లో నేడు, శుక్రవారం ఉదయం ఏర్పాటు చేసిన అన్నసమారాధన కార్యక్రమాన్ని రాష్ట్ర శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు గారు ప్రారంభించారు. శ్రీ వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
