సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరంలోని శ్రీ విష్ణు ఇంజినీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ వారి నేతృత్వంలో , ‘విమెన్ టెక్నాలజీ పార్క్’ ఆధ్వర్యంలో 2022 డిసెంబర్ 15 నుండి 20 వరకు మహిళా పారిశ్రామికవేత్తల కోసం ఐదు రోజుల నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాన్ని యనమదుర్రు క్యాంపస్‌లో ప్రభావన మల్టీ స్టేట్ ఉమెన్స్ జ్యూట్ అండ్ అలైడ్ ప్రొడక్ట్స్ కోఆపరేటివ్ సొసైటీ, హైదరాబాద్ వారి సహకారంతో నిర్వహించడం జరిగిందని నేడు, మంగళవారం (Dt. 20.12.2022) కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి. శ్రీనివాసరావు తెలియజేసారు. ఈ కార్యక్రమం ‘ఉమెన్ టెక్నాలజీ పార్క్’ మరియు ‘విష్వ టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ (VTBI)’ ఉమ్మడి కృషి యొక్క ఫలితం అని చెప్పారు.ఇందులో విష్వ టిబిఐ సిఇఒ డాక్టర్ ఎం.కె.కౌశిక్ మాట్లాడుతూ.. ప్లాస్టిక్‌కు సహజమైన జనపనార, కొబ్బరి పీచు, అరటి నార వంటి ఫైబర్ ఉత్పత్తులే అత్యుత్తమ ప్రత్యామ్నాయమని అన్నారు. ఇందులో శిక్షణ పొందిన మహిళా బృందాన్ని ‘ప్రభావన’ సంస్థ ఆధ్వర్యంలో ఎంటర్‌ప్రెన్యూర్ గ్రూపుగా చేర్చనున్నట్లు, వేదిక్, విద్యార్థి వ్యవహారాల డైరెక్టర్ శ్రీమతి మనీషా కృష్ణపుర్కర్ తెలిపారు. శిక్షణ పొందిన మహిళా సంఘాలు నాణ్యమైన జనపనార సంచులను తయారు చేయనున్నాయని, వీటిని జ్యూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సహకారం ద్వారా తిరుపతి తిరుమల దేవస్థానానికి సరఫరా చేయనున్నామని అన్నారు..ప్రభావన’ అనే సంస్థ 157 మంది మహిళా సభ్యుల సంఘమని, ఇది తెలుగు మాట్లాడే రెండు రాష్ట్రాల్లోనూ పర్యావరణ అనుకూల ఉత్పత్తులను తయారు చేయడంపై వివిధ ప్రాజెక్టులను అమలు చేస్తోందని, తెలుగు రాష్ట్రాల్లో ట్రాన్స్‌జెండర్లకు కూడా ఉపాధి కల్పన కార్యకలాపాలపై కృషి చేస్తున్న తొలి మహిళా సహకార సంస్థ తెలియజేసారు. ఇందునిమిత్తం భీమవరం పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ఆసక్తిగల మహిళా సంఘాలు శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీకి చెందిన యనమదుర్రు క్యాంపస్‌లోని ఉమెన్ టెక్నాలజీ పార్కును సందర్శించవచ్చని కోరారు.ఈ కార్యక్రమంలో శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ, రీసెర్చ్ & ఇన్నోవేషన్ సి.ఈ.ఓ. డాక్టర్ భూబేష్ కుమార్ , కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి. శ్రీనివాసరావు మరియు వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పి.శ్రీనివాసరాజు , తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *