సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలోని డాక్టర్ బివి రాజు మరియు విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ వారి శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజీ లో ఇండియన్ సొసైటీ ఫర్ టెక్నీకల్ ఎడ్యుకేషన్ (I S T E ) స్టూడెంట్ చాప్టర్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మంగళం వేణు తెలిపారు. పరిశ్రమలకు ఇతర సంస్థలకు కావలసిన సమర్ధవంతమైన సాంకేతిక ఇంజనీర్లను తయారు చెయ్యడానికి దేశం అభివృద్ధికి పాటు పడే సభ్యులుకు ఇందులో స్తానం కలిపించడం జరుగుతుందని జాతీయ స్థాయిలో ఈ అంశాలపై జరిగే సెమినార్లు ఏర్పాటు చేస్తామని దీనితో విద్యార్థుల మేధా శక్తి మరింత అపారమౌతుందన్నారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్ర ప్రదేశ్ I S T E చైర్మెన్ ప్రొపెసర్ రంగ జనార్దన్ మాట్లాడుతూ.. 1000 మంది విద్యార్థులు 180 మందిఅధ్యాపకులు I S T E లో చేరికతో భీమవరం విష్ణు.. రాష్ట్రంలో రికార్డు సృష్టించిందని విద్యార్థుల సాంకేతిక పరమైన పఠనాసక్తి కి గర్వకారణంగా నిలుస్తుందని, క్యాంపస్ లో చక్కటి ఆధునిక నిర్మాణాలు ఏర్పాట్లు ఉన్నాయని వీటిని విద్యార్థులు సద్వినియోగ పరుచుకొని ఉన్నత భవిశ్యత్తు బాటలు వేసుకోవాలని పిలుపు నిచ్చారు. ఈ సందర్భముగా సాంసృతిక ప్రదర్శనలు , పోటీలు, విద్యార్థులకు బహుమతి ప్రధానం జరిగాయి.
