సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలోని శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ (అటానమస్) కళాశాలలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగం నేడు సోమవారం జునిపర్ నెట్‌వర్క్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించింది, ఆ తర్వాత ‘మిస్ట్ ఎ.ఐ.’ పై ఆరు రోజుల ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ప్రారంభమైంది. ఈ శిక్షణ తరగతులను ఈ నవంబర్ 24నుండి 29 నవంబర్ 2025 వరకు జునిపర్ నెట్‌వర్క్స్ మద్దతుతో ఎడ్యుస్కిల్స్ ఫౌండేషన్‌ నిర్వహిస్తుంది. ఎ.ఐ. ఆధారిత నెట్‌వర్కింగ్, నెట్‌వర్క్ ఆటోమేషన్, మిస్ట్ ఎ.ఐ. క్లౌడ్ ఆర్కిటెక్చర్, జూనోస్ ఆపరేటింగ్ సిస్టం, మార్విస్ ఎ.ఐ., జీరో ట్రస్ట్ నెట్‌వర్క్‌లు మరియు తదుపరి ‘క్యాంపస్ నెట్‌వర్క్ ఆటోమేషన్‌లో అధునాతన నైపుణ్యాలతో అధ్యాపకులను నిపుణులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో’ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఎడ్యుస్కిల్స్ ఫౌండేషన్ టాలెంట్ డెవలప్‌మెంట్ మేనేజర్, మితు స్వైన్ గారి సమక్షంలో ‘సెంటర్ అఫ్ ఎక్స్లెన్స్’ మరియు ‘ఫాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం’ లు ప్రారంభించబడ్డాయి. ఆయన మాట్లాడుతూ ఎ.ఐ. ఆధారిత నెట్‌వర్క్ నిర్వహణ కోసం వేగంగా పెరుగుతున్న ప్రపంచ డిమాండ్‌ను ఆయన నొక్కిచెప్పారు, ఈ కార్యక్రమానికి కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి. వెంకట రామరాజు ,ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగాధిపతి డాక్టర్ ఎ. శ్రీ కృష్ణ , అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని, జయప్రదం చేయడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *