సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో టెక్నికల్ ఎడ్యుకేషన్ రంగంలో అత్యుత్తమ పనితీరును కనబరిచినందుకు గానూ, భీమవరం కు చెందిన శ్రీ విష్ణు ఇంజినీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్, కు గౌరవనీయులైన శ్రీమతి రహతున్ నేసా అలీ మెమోరియల్ ఐ.ఎస్.టి.ఇ. నేషనల్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఉమెన్ ఇంజినీరింగ్ కాలేజ్ ఆఫ్ ఇండియా – 2023 ను చేజిక్కించుకుంది. ఈ అవార్డును భువనేశ్వర్‌లోని కిట్స్ యూనివర్సిటీలో జరిగిన 53వ ఐ.ఎస్.టి.ఇ. నేషనల్ కన్వెన్షన్‌లో కిట్స్ విశ్వవిద్యాలయం వ్యవస్థాపకుడు డాక్టర్ సమంతా మరియు ఐ.ఎస్.టి.ఇ. అధ్యక్షుడు ప్రతాప్ సిన్హ్ దేశాయ్ నుండి కళాశాల వైస్ ప్రిన్సిపాల్, పి. వెంకటరామ రాజు మరియు ఆర్&డి డీన్ డాక్టర్. జి.ఆర్.ఎల్.వి.ఎన్. శ్రీనివాస రాజు అందుకున్నారు. ఈ శుభసందర్భంగా శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ కె.వి. విష్ణు రాజు గారు మరియు ఇతర మేనేజ్మెంట్ సభ్యులు ఈ ప్రతిష్టాత్మక అవార్డును సాధించినందుకు ఐ.ఎస్.టి.ఇ. ఫ్యాకల్టీ అడ్వైజర్ మరియు కళాశాల సిబ్బందిని అభినందించారు.
