సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి ‘ఫుడ్ సేఫ్టీ & స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు ‘ఈట్ రైట్ ఇండియా విజన్‘ లో భాగంగా దేశవ్యాప్తంగా నిర్వహించబడినటువంటి ట్రైట్ క్యాంపస్ సర్టిఫికేషన్ ప్రోగ్రాం’ లో భాగంగా చేపట్టిన తనిఖీలో క్యాంపస్లో సురక్షితమైన, ఆరోగ్యకరమైన మరియు పోషకమైన ఆహారాన్ని అందజేస్తున్నందుకు గాను శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ, భీమవరం క్యాంపస్ ను “ఈట్ రైట్ క్యాంపస్” గుర్తించి, సర్టిఫికెట్ ప్రదానం చేయడం జరిగింది. కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ FSSAI ద్వారా ధృవీకరించబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ‘ఈట్ రైట్ క్యాంపస్’ సర్టిఫికెట్ ను పొందిన మొట్ట మొదటి ప్రయివేట్ విద్యా క్యాంపస్ గా నిలిచింది.ఈ సందర్భంగా శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ, చైర్మన్, కె.వి. విష్ణు రాజు మాట్లాడుతూ ..’ఈట్ రైట్ క్యాంపస్ సర్టిఫికేషన్’ అనేది విద్యార్థులు మరియు సిబ్బంది ఆరోగ్య భద్రత కొరకు క్యాంపస్ చేస్తున్న కృషిని గుర్తిస్తుందని, అంతేకాకుండా క్యాంపస్ పేరు ప్రతిష్ఠలకు మంచి బ్రాండ్ విలువను జోడించి, ఈ ఉత్తమ ప్రమాణాలను అనుసరించేలా ఇతరులను సైతం ప్రేరేపించేలా చేస్తుందని పేర్కొన్నారు. ప్రత్యేకించి, విద్యార్థుల ఆరోగ్యమే ప్రధాన ధ్యేయంగా ప్రయత్నాలను చేయడానికి ఇది ఒక ప్రత్యేక అవకాశాన్ని అందిస్తుందని కూడా అన్నారు.
