సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో ఏకాదశి శుభముహర్తం లో నేటి బుధవారం ఉదయం పలు శుభకార్యక్రమాలు జరిగాయి. విద్యార్థులకు మంచి ముహూర్తం ఉండటంతో పట్టణంలోని పలు దేవి దేవాలయాల లో చిన్నారులకు శ్రీ సరస్వతి దేవి అస్సిసులతో అక్షర అభ్యాసం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో స్థానిక బివి రాజు ఫౌండేషన్ వారి శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజీ లోని ఆధ్యాత్మికత ఉట్టిపడే ముచ్చటైన దేవాలయాల సమూహంలో చదువుల తల్లి శ్రీ సరస్వతి ఆలయంలో పలువురు చిన్నారులకు స్థానిక వేదపండితుల ఆధ్వర్యంలో తల్లి తండ్రులు ఓంకారం తో అక్షరాబ్యాసం ప్రారంభించడం జరిగింది. ఎంతో కోలాహలంగా ఈ కార్యక్రమం జరిగింది.
