సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం, విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ సివిల్ ఇంజినీరింగ్ నందు నేడు, గురువారం ‘ది నేషనల్ లెవెల్ కాంక్రీట్ కేనో కార్నివాల్ ఛాలెంజ్ – 2K24” ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మంగం వేణు మరియు డైరెక్టర్, డాక్టర్ దశిక సూర్యనారాయణ మాట్లాడుతూ.. ఈ పోటీ విద్యార్థులకు సవాలుతో కూడిన ప్రాజెక్ట్ అని, ఇంజనీరింగ్ నైపుణ్యం, హైడ్రో డైనమిక్ డిజైన్ మరియు రేసింగ్ టెక్నిక్‌లను మిళితం చేసే ఈ అనుబంధ పోటీ సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు బాగా సహాయపడుతుంది అన్నారు. శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్, కె వి విష్ణు రాజు, మాట్లాడుతూ.. కాంక్రీట్ తో తేలికైన పడవను తయారుచేయుట మరింత హైడ్రోడైనమిక్ సాఫ్ట్‌వేర్ బోట్‌ను రూపొందించడానికి, ఎలా ఉపయోగించాలో విద్యార్థులు నేర్చుకోవడం ఈ పోటీ యొక్క ప్రధాన ఉదేశ్యం అని అన్నారు. ప్రసుతకాలంలో చాలా మంది విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ మరియు అనుబంధ బ్రాంచ్ లను మాత్రమే ఇష్టపడుతున్నారని, ఇది చాలా ఇంజినీరింగ్ కాలేజీలలో కోర్ బ్రాంచ్‌ల పట్ల నిర్లక్ష్యానికి దారితీస్తుందని, కానీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ అన్ని బ్రాంచ్ లకు సమాన ప్రాముఖ్యత నిస్తుంది అని అన్నారు. ఈ రోజుల్లో సివిల్ ఇంజనీరింగ్ అనేది సివిల్ ఇంజనీరింగ్ మాత్రమే కాదని, మెకానికల్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కోడింగ్ మొదలైనవి కూడా మిళితమై ఉన్నియని అని అన్నారు. కాంక్రీట్ కేనో కార్నివాల్ ఛాలెంజ్ వంటి పోటీలు డిపార్ట్‌మెంట్‌కు ప్రైడ్ తీసుకురావడానికి మరియు విద్యార్థుల ఆసక్తి ని పెంపొందించడానికి అని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ విష్ణు .. సొసైటీ జాయింట్ సెక్రటరీ శ్రీ కె సాయి సుమంత్ , ఐ.ఐ.టీ.- తిరుపతి డాక్టర్ బి.జానకి రామయ్య తదితరులు పాల్గొన్నారు.
