సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో స్థానిక శ్రీ విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ,అటానమస్ కాలేజీ లోనేడు, మంగళవారం అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ , డాక్టర్ మంకం నేణు మాట్లాడుతూ.. కళాశాలలో స్థాపించిన అసిస్టెంట్ టెక్నాలజీ ల్యాబ్ (A T L) నందు వికలాంగులకు చేయూత నిచ్చే పరికరాలు తయారు చేయడంపై ద్రుష్టి సారించే అధ్యాపకులను అభినందించారు. ముఖ్యఅతిధిగా విచ్చేసిన ప్రముఖనేత్ర వైద్యుడు, మరియు కంటి చూపు లేని యువతను ఆదుకొని వారికీ విద్య బుద్దులు నేర్పి ఉద్యొగ అవకాశాలు కల్పించే ‘ఉద్దరాజు సుబ్బరాజు మెమోరియల్ ట్రస్ట్’ పెంటర్ ఫర్ విజువల్లీ ఛాలెంజ్ స్థాపకుడు డాక్టర్ రమణ రాజు మాట్లాడుతూ.. vIT లో వికలాంగులు మేలు చేసేలా ప్రత్యేక ల్యాబ్ A T L ను ఏర్పాటు చేసారని వికలాంగుల కు ఉపయోగపడే సాంకేతికతను మరింత అభివృద్ధి పరచాలని .. ఒక నేత్ర వైద్యుడు గా విష్ణు సొసైటీ వ్యవస్థాపకులు డాక్టర్ బివి రాజు గారితో సత్సంబంధాలు కలిగి ఉఁడేవాడినని ప్రస్తుత చైర్మెన్ విష్ణురాజు తో కలసి 16 ఏళ్ళ క్రితం అమెరికా పర్యటనలో ఒక్కడి ఒక విశ్వవిద్యాలయం లో వికలాంగుల కోసం చేస్తున్న కృషి చూసి అదే స్పూర్తితో మన భీమవరం విష్ణు కాలజీ లో ఈ ల్యాబ్ స్థాపించడం ఈ సేవా కార్యక్రమంలో నేను కూడా భాగస్వాములుగా పనిచేస్తున్నందుకు గర్వంగా ఉందని తెలియజేశారు. నా ఉద్దరాజు సుబ్బరాజు మెమోరియల్ లో ఇప్పటికి 260 మంది అందులకు చూపును కల్పించామని, అలాగే ప్రస్తుతం 22 విద్యార్థులు తో కళాశాల స్థాయికి ఎదిగిందని మా కళాశాలలో కళాశాలలో శిక్షణ పొందిన 20 మంది 30 నుండి 70 వెల వరకు జీతాలు సంపాదించే ఉద్యోగాలు సాధించారని గర్వముగా తెలియజేసారు. ఈ కార్యక్రమంలో అంధ విద్యార్థులకు, వికలాంగులకు పరికరాలు తయారు చేసే టక్నాలజీ రూపొందిస్తున్న విద్యార్థులకు అభినందలు సర్టిఫికెట్ లు అందించారు.
