సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ భీమవరం నందు జరిగిన “ఎక్స్ప్లోరింగ్ పర్సనాలిటీస్ అండ్ హ్యూమన్ వాల్యూస్’ అనే అంశంపై చిన్మయ మిషన్, నోయిడా, న్యూఢిల్లీ నుండి వచ్చిన పూజ స్వామి చిదురుపానందాజీ ఈ విద్యాసంస్థకు చెందిన వివిధ కళాశాలల విద్యార్థిని విద్యార్థులు ఉద్దేశించి మాట్లాడారు. కార్యక్రమాన్ని సైకాలజీ డిపార్ట్మెంట్ మరియు స్టూడెంట్స్ సక్సెస్ సెంటర్ సంయుక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పూజ్య స్వామి చిత్రరుపానందాజీ విద్యార్థులు వారి నిజమైన లక్ష్యాలు ఎలా ఉండాలి. తాత్కాలిక లక్ష్యాలు శాశ్వత లక్ష్యాలు ఏ విధంగా కనుగొనాలి, వాటిని మన వ్యక్తిత్వానికి తగినట్టుగా ఏ విధంగా మలుచుకోవాలి మరియు మానవతా విలువలు పెంపొందించుకోవడానికి ఎలాంటి పనులు చేపట్టాలి వంటి ఆసక్తికర విషయాలపై ఉత్తేజపరితంగా ప్రసంగించారు. విద్యార్థులలో ఉన్న ప్రస్తుత కాలం అలవాట్ల నుంచి ఏ విధంగా బయటపడాలి సమస్యలను ఏ విధంగా పాజిటివ్గా మలుచుకోవాలి అనే అంశాలు ప్రస్తావించారు..ఈ కార్యక్రమంలో కళాశాల జిఏడి డైరెక్టర్ జె ప్రసాదరాజు, డైరెక్టర్ ఫర్ స్టూడెంట్ అఫైర్స్ అండ్ అడ్మిన్, డాక్టర్ పి శ్రీనివాసరాజు, వివిధ కళాశాలల ప్రిన్సిపల్స్ హెడ్ ఆఫ్ ద. డిపార్ట్మెంట్స్ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
