సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణం నడిబొడ్డున స్థానిక ఇండియన్ బ్యాంకు రోడ్డులో ( మన సిగ్మా వెబ్ ఛానెల్ ఆఫీస్ వద్ద) సుమారు 150 ఏళ్ళ పైగా చరిత్ర కలిగిన మహిమ కలిగిన ‘శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి వారి సంబర మహోత్సవం మహర్నవమి సందర్భముగా నిన్న ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. సంబరం ప్రారంభానికి ముందు స్వామి వారి మహిమగా ఎప్పటిలానే గత రాత్రి చిరు జలులు పడ్డాయి. తదుపరి సంబరం ప్రారంభం అయ్యింది. వందలాదిగా కర్ణి భక్తులు ఎంతో దూర ప్రాంతాలను నుండి సైతం వచ్చి శ్రీ స్వామివారిని దర్శించుకొన్నారు. మహా నైవేద్యాలు సమర్పించారు. ప్రతి ఏడాది ఆచారం ప్రకారం రాత్రి 10 గంటలకు కణ కణ మని మండుతున్న నిప్పుల గుండం ఫై మ్రొక్కులు ఉన్న భక్తులు అసారభ .. అసారభ అంటూ అరుస్తూ నిప్పులపై నడచి తమ మ్రొక్కులు చెల్లించారు. రాత్రి 10న్నర గంటలకు శ్రీ స్వామివారికి మేళతాళాలతో , మంటలతో శూలాలతో వీర శైవ నృచాలు ,డప్పు వాయిద్యాల నడుమ.. శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామివారు నంది వాహనం ఎక్కి నగర సంచారం చేసి నేటి బుధవారం తెల్లవారు జామున 4 గంటలకు దేవాలయం కు తిరిగి రావడంతో సంబరం ముగిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *