సిగ్మా తెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం 2 టౌన్ లోని స్థానిక శ్రీ వెంకటేశ్వర బధిర పాఠశాల లో సంక్రాంతి పండుగ సందర్భంగా విద్యార్థులకు ఈ రోజు దుస్తులు , స్వీట్స్ ను DNR కళాశాల అసోసియేషన్ కార్యదర్శి గాదిరాజు సత్యనారాయణ రాజు ( బాబు) ఆద్వర్యం లో గాదిరాజు సోమరాజు గారు , కాంతమ్మ దంపతులు చే పంచిపెట్టారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ 1985 సంవత్సరం లో అప్పటి DNR కళాశాల అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ గోకరాజు రంగరాజు గారు తిరుమల తిరుపతి దేవస్థానం తో సంప్రదించి ప్రత్యేక అవసారాలున్న బాల బాలికలకు విద్యను అందించాలనే ఉద్దేశ్యం తో 2 ఎకరాల స్థలం కేటాయించి ఈ బధిర పాఠశాలను ఏర్పాటు చేశారని తెలిపారు.ఇక్కడ చదివిన విద్యార్థులు పలు సంస్థలలో ఉన్నతంగా ఉన్నారని తెలిపారు.ఈ సందర్భం గా గాదిరాజు సోమరాజు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లానే ఈ సంవత్సరం కూడా సుమారు 130 మంది విద్యార్థులకు దుస్తులు స్వీట్స్ పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ప్రతి వ్యక్తి తనకు ఉన్న తహతను బట్టి సామాజిక సేవను చెయ్యాలని అన్నారు. ఈ కార్యక్రమం లో బధిర పాఠశాల అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
