సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ నేడు, గురువారం భీమవరంలో 3 టౌన్ లోని వెంకట సాయిబాబా 12వ వార్షికోత్సవాలు ప్రారంబోత్సలలో పాల్గొన్నారు. ఆయన వెంట పీఏసీ సభ్యులు కనకరాజు సూరి, మల్లినేడి బాబ్జి మరియు జనసేన జిల్లా అడ్జక్షుడు చినబాబు తదితర కీలక నేతలు పాల్గొన్నారు. బాబా ఆలయాన్ని సందర్శించిన నాదెండ్ల ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి బాబావారి అన్నాభిషేకం లో పాల్గొన్నారు. తదుపరి మీడియాతో మాట్లాడుతూ.. మొన్న పవన్ కళ్యాణ్, తాను చేసిన ఢిల్లీ పర్యటనలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయన్నారు. జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును పూర్తిగా నిర్వీర్యం చేసేసిందని అన్నారు, 45.72 మీటర్లు ఎత్తు ఉండాల్సిన పోలవరం ప్రాజెక్టును 41.15కు మొదటి దశలో పూర్తి చేస్తామని అనడం ప్రజలను మోసం చేయడం కాదా? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయితే ప్రాజెక్టు మరమత్తు కోసం 2,030 కోట్ల రూపాయలు పోలవరం అధారిటీ నుంచి శాంక్షన్ కాకపోయిన జీవో విడుదల చేయడం అవినీతి కాదా ? అంటూ ప్రశ్నించారు, లక్ష కుటుంబాలు నిర్వాసితులైతే ప్రభుత్వం కేవలం 24 వేల కుటుంబాలకే పది లక్షల చొప్పున ఇచ్చేసి చేతులు దులుపుకుందామని చూస్తున్నారని ఆరోపించారు, రాబోయే నెలలో పోలవరం ప్రాజెక్టును పవన్ కళ్యాణ్ సందర్శిస్తారని తెలిపారు. జగన్ సర్కార్ ‘‘బైజుస్‌లో 700 కోట్లు స్కామ్ చేసారని నాదెండ్ల మనోహర్ తీవ్రస్థాయిలో ఆరోపించారు,
