సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పవిత్ర పంచారామ క్షేత్రం భీమవరం గునూపూడిలో వేంచేసి యున్న శ్రీ సోమేశ్వర జనార్థనస్వామి దేవస్థానంలో శ్రీ స్వామివారిని దర్శించుకున్న గుడివాడ వాస్తవ్యులు యామిజాల సాగర సుబ్బలక్ష్మి, తన భర్త యామిజాల లక్ష్మినారాయణ గారి జ్ఞాపకార్ధం రూ.1,01,116/- విరాళాన్ని దేవాలయంలో నిత్యం జరిగే భక్తుల అన్నసమారాధన ట్రస్ట్ కు సమర్పించారు. ఈ సందర్భముగా ఆమెకు ఆమె కుమారునకు శ్రీ స్వామి వారి ప్రసాదం జ్ఞాపిక దేవాలయ సిబ్బంది అందజేసారు.
