సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో పంచారామ క్షేత్రంగా ప్రసిద్ధి పొందిన శ్రీ సోమేశ్వర దేవాలయంలో నేడు, సోమవారం శ్రీ సోమేశ్వరుడు, శ్రీ పార్వతీదేవి, శ్రీ అన్నపూర్ణాదేవి శాఖంబర అవతారాలలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయం లోపల కాయగూరలు, ఆకుకూరలు, పువ్వులు పండ్ల తో విభిన్న ఆకృతులతో అలంకరణ చేసారు. ఈ ఏర్పాట్లు ధర్మకర్తల మండలి సభ్యులు పర్యవేక్షణలో జరిగిందని చైర్మెన్, కోడె విజయలక్ష్మి తెలిపారు. భక్తులు విశేషంగా హాజరయి శ్రీ స్వామివార్లను, అమ్మవార్లను దర్శించుకొని అస్సిసులు పొందారు. అలాగే నేడు అమావాస్య కావడంతో భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయంలో వేదపండితుల మంత్రోచ్చారణ లతో “చండి హోమం’ ను ఘనంగా నిర్వహించారు.
