సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:భీమవరం శ్రీ సుబ్రమణ్య షష్ఠి 3వ రోజు వేడుకలలో భాగంగా నేటి, శనివారం రాత్రి సుమారు 20వేల మంది భక్తులతో శ్రీరామపురం ప్రాంతం సాయంత్రం 6గంటల నుండి రాత్రి 10గంటలు దాటిన ఎడతెగని ఆబాలగోపాలం కేరింతలు, జనసందోహంతో కళకళ లాడింది. ఒక ప్రక్క శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ వల్లీదేవసేన శ్రీ సుబ్రహ్మణ్యం స్వామిని ఉత్సవ మూర్తులతో తెప్పోత్సవంలో పంటకాలువ కెనాల్ లో బాణసంచా కాలుపుల మధ్య వేదమంత్రోచ్ఛరణల మధ్య ఊరేగింపు.. మరో ప్రక్క సుమారు కిలోమీటర్ దూరం విస్తరించిన చిరువ్యాపారులు తీర్ధం జోరులో , మరో ప్రక్క ఎగ్జిబిషన్ లో జయింట్ వీల్ , కొలంబస్ ల జోరులో సందడి లో యువత బూరల ఉదుడు శబ్దాలతో కనివిని ఎరుగని సందడి నెలకొంది. తెప్పోత్సవమ్ ముగిసాక భారీ హంస వాహనంలో స్వామివారిని దేవేరుల ఉత్సవ విగ్రహాలను పల్లకిల ఊరేగింపుతో తిరిగి దేవాలయంకు చేరుకొన్నాయి తీర్ధంలో ఎక్కడికక్కడ పోలీసులు మాత్రం చక్కగా పరిస్థితిని గమనిస్తూ, యువత దూకుడు కంట్రోల్ చేస్తూ షష్ఠి వేడుకలను పర్యవేక్షించడం అభినందనీయం.
