సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం సమీపంలోని మోగల్లు గ్రామం నుండి భీమవరం వైపు నేటి మంగళవారం ఉదయం బయలు దేరిన ఒక ప్రవేటు ప్రముఖ విద్యాసంస్థ బస్సు పాలకోడేరు గ్రామం వద్ద అదుపు తప్పి అక్కడ ఉన్న బెండ తోట లోకి దూసుకొనిపోవడం తో అందులో ప్రయాణిస్తున్న విద్యారులు లో 10 మందికి గాయాలు కావడం వారిలో 7 గురుకి తీవ్రంగా దెబ్బలు తగలటంతో భీమవరంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్ అతి వేగం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ప్రాధమిక విచారణలో భావిస్తున్నారు.. పాలకోడేరు రూరల్ పోలిసుల నుండి పూర్తీ సమాచారం అందవలసి ఉంది.
