సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రోడ్ షో మరియు జగనన్న విద్య దీవేన నిధులు విడుదల కార్యక్రమం వేలాది విద్యార్థులు ప్రజలు మధ్య చాల ప్రశాంతంగా జరిగింది. నేటి శుక్రవారం ఉదయం సీఎం జగన్ లూథరన్ హైస్కూల్ నుండి బివి రాజు మార్గ్ వరకు అటుగా బై పాస్ రోడ్డులోని బహిరంగ సభ వరకు వైసిపి జెండాలు, భారీ ఫ్లెక్సీ ల స్వాగత ద్వారాలతో పాటు ప్రధాన కూడళ్లలో వైసిపి శిబిరాలు లో వేదికలు ఏర్పాటు చేసి కళాకారులూ, విద్యార్థులు జగనన్న పధకాలు వివరిస్తూ పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసారు. ప్రతి 15 అడుగులకు ఒక పోలీస్ తరపున భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించడం గమనార్హం. ఆలా అని ప్రయాణికులకు వ్యాపారస్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సహకరించడం అబినందించదగింది. అంబెడ్కర్ సెంటర్లో భీమవరం లాయర్లు BAR అసోసియేషన్ వారు ఏపీ ఆక్ట్ 27/23 రద్దు కోరుతూ నిరసన దీక్ష శిబిరం ఏర్పాటు చేసారు. ఇక రోడ్ షో ప్రారంభం ప్రాంతంలో కొద్దిమంది అంగన్‌వాడీ టీచర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టణంలో పలువురు లెఫ్ట్ పార్టీల, జనసేన నేతలను పోలీసులు ముందస్తుగా గృహనిర్బంధంలో ఉంచారు. మొత్తానికి 25 వేల మంది వస్తారన్న ముందస్తు అంచన వేసినప్పటికీ సభలో అంతకు మించి 40వేల వరకు రావడం వారికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా వైసిపి నేతలు, ప్రభుత్వ అధికారులు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి సభను విజయవంతం చేసారు. సీఎం జగన్ సభ ప్రాంగణంలోకి రాగానే ప్రభుత్వ విఫ్ స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, శాసనమండలి చైర్మెన్ కొయ్యే మోషేను రాజు,మంత్రి కారుమూరి తో కలసి అక్కడ ఏర్పాటు చేసిన స్వర్గీయ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి సీఎం జగన్ నివాళ్లు అర్పించి తదుపరి వేదికపైకి వెళ్లారు, సీఎం జగన్ వేదికపై ప్రసంగిస్తున్నప్పుడు విద్యార్థులు తమకు విద్య దీవెన ఇచ్చిన సీఎం జగన్ కు ఉత్సహంగా థాంక్ యూ జగనన్న అన్న కార్డ్స్ ప్రదర్శించడం గమనార్హం.
