సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం విష్ణు నగర్ లోని సీతా పాలిటెక్నిక్ కాలేజ్ ( Dr B V రాజు) కాలేజ్ లో జరిగిన రీజినల్ లెవెల్ పోలీ టెక్ ఫెస్టివెల్ 2022 కార్యక్రమాన్ని రాష్ట్ర శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం పాలిటెక్నిక్ విద్యార్థులు తమ ప్రజ్ఞా తో తయారు చేసిన ఎలక్ట్రానిక్ పరికరాల ప్రదర్శనను పరిశీలించి ఉపయోగాలు అడిగి తెలుస్తుకొన్నారు, ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ … నిర్వాహకులను ,అధ్యాపకులను, విద్యార్థినులను అభినందిస్తూ విద్యార్థులు ప్రపంచానికి ఉపయోగపడే నూతన ఆవిష్కరణలు మరిన్ని చెయ్యాలని ఆకాంక్షించారు.
