సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం గునుపూడి లో వేంచేసి యున్న పంచారామక్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల దేవస్థానం లో నేడు, ఆదివారం విశేషంగా వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు శ్రీ స్వామివారిని ఆలయ మర్యాదలతో దర్శించుకొని తదుపరి వేలాది భక్తులకు నిత్యా అన్నసమారాధన ను ప్రారంభించారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ.. కార్తీకమాసంలో వన సమారాధన ఫలం ఎంతో పుణ్యమని, దూర ప్రాంతాల నుంచి భగవంతుని దర్శనం కోసం వేలాదిమంది భక్తులు తరలివస్తారని, సాక్షాత్తు చంద్ర ప్రతిష్ట చేసిన . శ్రీ సోమేశ్వరుని దర్శనమే మహా భాగ్యమని అన్నారు.. అన్నిదానాల కెల్లా అన్నదానం ఎంతో గొప్పదని, అన్నారు. ఇక కార్తీకమాసోత్సవములు లో గత శనివారం 22వ రోజు సందర్భముగా సేవల వలన రూ.6,550/- రూ.200/-ల దర్శనం టిక్కెట్ల వలన రూ.35,000/-లు రూ.100/-ల దర్శనం టిక్కెట్ల వలన రూ.52,300/-లు, రూ.50/-ల దర్శనం టిక్కెట్ల వలన రూ.45,800/-లు, లడ్డుల వలన రూ.19,770/-లు, అన్నదానం ట్రస్టు నిమిత్తం రూ.92,678/-లు, మొత్తం రూ.2,52,198/-లు వచ్చిందని గత శనివారం 5,000 మందికి అన్నప్రసాదం వితరణ చేసినట్లు కార్యనిర్వహణాధికారి, డి రామకృష్ణంరాజు తెలిపారు.
