సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గునుపూడిలో వేంచేసి యున్న పంచారామక్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల దేవస్థానం నందు కార్తీకమాసోత్సవములు సందర్భముగా 17వ రోజు ‘పవిత్ర కార్తీక సోమవారం’ సుమారు 50వేల మంది భక్తులు శ్రీ స్వామివారిని దర్శించుకొన్నారు. ఈ సందర్భముగా రూ.200/- దర్శనం టిక్కెట్ల వలన రూ.3,12,800/-, రూ.100/-లదర్శనం టిక్కెట్ల వలన రూ.2,92,500/-, రూ.50/-ల దర్శనం టిక్కెట్ల వలన రూ.1,39,050/-, లడ్డు ప్రసాదం వలన రూ.30,600/-లు, అన్నదానం ట్రస్టు నిమిత్తం రూ.1,69,206/-లు, మెత్తం రూ.9,44,156/-లు వచ్చి యున్నది. ఈరోజు ది భీమవరం మోటార్ లారీ ఓనర్స్ యూనియన్, భీమవరం వారిచే పెద్ద ఎత్తున ఏకంగా 18,000 మందికి అన్నప్రసాదం వితరణ జరిపారు. . ఈ కార్యక్రమములు యందు గ్రామస్తులు, భక్తులు పాల్గొని సహాయ సహకారములు అందించారు. . స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు దంపతులు, మరియు పత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు దంపతులు, స్వామివారిని దర్శించుకొనగా ఆలయం అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.ఫై చిత్రంలో నేడు, సాయంత్రం శ్రీ సోమేశ్వరుని దివ్య అలంకరణ చూడవచ్చు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *