సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేటి ఆదివారం మధ్యాహ్నం భీమవరం గునుపూడిలో వేంచేసియున్న పంచారామక్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల దేవస్థానం నందు శ్రీ సోమేశ్వర స్వామి వార్కి శోభకృత నామ సంవత్సం చివరి మాస శివరాత్రి సందర్భముగా లోక కళ్యాణార్థం అర్చక స్వాముల వేదమంత్రోచ్చారణతో విభూది చల్లుతూ పరమశివునికి అత్యంత ప్రియమైన.. భస్మాభిషేకం’ కార్యక్రమంను ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో సూర్య కిరణాలూ కూడా శ్రీ స్వామివారిని తాకాయి. భస్మాభిషేకాన్ని వీక్షించడానికి భక్తులు విశేషంగా హాజరు అయ్యారు. శ్రీ స్వామి వారి తీర్థ ప్రసాదములు స్వీకరించారని దేవాలయ కార్యనిర్వహణాధికారి డి రామకృష్ణంరాజు తెలిపారు.
