సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మరియు భీమవరం హాస్పిటల్స్ సంయుక్తంగా ఈ జిల్లా వాసులకు పూర్తి స్థాయి గుండె వైద్య సేవలు అందించడానికి ఆస్టర్ రమేష్ భీమవరం హాస్పిటల్స్, సెంటర్ ఫర్ కార్డియాక్ సైన్సెస్ ను నేడు, ఆదివారం జిల్లాలో ప్రముఖ డాక్టర్స్ సమక్షంలో ఘనంగా ప్రారంభించారు. భీమవరం హాస్పిటల్స్ ప్రాంగణంలో గుండె వైద్య విభాగం ను ప్రముఖ వైద్యులు, పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్యనారాయణ మూర్తి(బాబ్జి) ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ బాబ్జి మాట్లాడుతూ.. గుండె వైద్యంలో 35 సంవత్సరములుగా ఎంతో ఖ్యాతి గాంచిన రమేష్ హాస్పిటల్స్ ఇక్కడ వైద్య సేవలందించడానికి ముందుకు వచ్చినందుకు వారికీ మరియు భీమవరం హాస్పిటల్స్ యాజమాన్యాలను అభినందించారు..రమేష్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పోతినేని రమేష్ బాబు మాట్లాడుతూ .. గుండె జబ్బులలో అందించవలసిన వైద్యం ప్రతి క్షణం ఎంతో అమూల్యమైనదని, ఎటువంటి ఆలస్యంలో లేకుండా వేగంగా బై పాస్ సర్జరీ చేసి రోగిని కాపాడేందుకు గోదావరి జిల్లాల ప్రజలకు అందుబాటులో.. భీమవరంలో సువిశాల ప్రాంగణంలో, అత్యున్నత ప్రమాణాలతో వైద్యం అందిస్తున్న భీమవరం హాస్పిటల్స్ నందు పూర్తిస్థాయి గుండె వైద్య సేవలు లభ్యమయ్యేల ఏర్పాట్లు చేశామన్నారు. ఇక్కడ ఇద్దరు కార్డియాలజిస్టులు, ముగ్గురు క్లినికల్ కార్డియాలజిస్టుల వైద్య బృందంతో యాంజియోగ్రామ్, స్టెంట్ యాంజియోప్లాస్టి, పేస్ మేకర్, హార్ట్ ఎటాక్ మరియు అన్ని గుండె సమస్యలకు అత్యవసర వైద్యం అందిస్తామన్నారు. భీమవరం హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణంరాజు మరియు ఎక్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ గోపాలరాజు మాట్లాడుతూ.. ఈ ప్రాంత ప్రజలకు అన్ని రకముల స్పెషాలిటీ మరియు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను నిష్ణాతులయిన వైద్యులతో ఇక్కడ ‘మెడికల్ హబ్’ క్రింద అందించే ప్రయత్నంలో భాగంగా ఇప్పటి ఒమేగా కాన్సర్ హాస్పటల్ ఏర్పాటు చేశామని ఇప్పుడు ఇక్కడే గుండె వైద్యంలో అపారమైన అనుభవం కలిగిన రమేష్ హాస్పిటల్స్ భాగస్వామ్యంతో నెలకొల్పామని ఇక్కడ రోజు 24 గంటలూ నిపుణులైన గుండె వైద్య బృందంతో ఆధునాతన వైద్య పరికరాలతో సేవలందిస్తామని తెలియచేసారు. ఈ ఆధునిక గుండె వైద్యం ఖరీదైన సరే! అందరికి అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తామన్నారు.
