సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం 3 టౌన్, స్థానిక హౌసింగ్ బోర్డులో శ్రీ పద్మావతి వేంకటేశ్వర స్వామి వారి 12వ వార్షిక బ్రహ్మోత్సవాలు ముగింపు సందర్భంగా నిర్వాహకులు ఘనంగా అన్నసమారాధన కార్యక్రమాన్ని నేడు, శుక్రవారం నిర్వహించారు. బ్రహ్మోత్సలు ముగింపు కార్యక్రమంలో భీమవరం జనసేన నాయకులు స్వామి వారిని దర్శించుకొన్నారు. జనసేన జిల్లా అధ్యక్షులు, నియోజవర్గ ఇంఛార్జి గోవిందరావుని కంతేటి వెంకటరాజు ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులు ఆలయ మర్యాదలతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో పట్టణ సెక్రటరీ సుంకర రవి, మాజీ కౌన్సిలర్ మాగపు ప్రసాద్, పంతం ప్రసాద్, రామాయణం శ్రీనివాస్, తిరుమల కృష్ణ,రామ్ ప్రసాద్, అప్పారావు ,ఆకుల శ్రీను, ఉండవల్లి శ్రీనివాస్, పాలకోడేటి కార్తిక్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *