సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో నేటి శనివారం ఉదయం స్థానిక 10వ వార్డులో జగనన్న సురక్ష సభ జరిగింది. ఈ సభకు కోడె యుగంధర్ అధ్యక్షత వహించారు. స్థానిక ఎమ్మెల్యే గ్రంథి. శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రజలను మాట్లాడుతూ.. సీఎం జగన్ సచివాలయ వ్యవస్థ తో వాలంటీర్లు సహకారంతో ప్రజలు ఇంటికే ప్రభుత్వ సేవలు, సంక్షేమ పధకాలు అందించడం తో పాటు, ఇప్పుడు జగన్నన్న సురక్ష’ క్రింద ఇంటింటికి ప్రభుత్వ లబ్ది అందాలని , గతంలో ఎమ్ ఆర్ ఐ ఆఫీసులు చుట్టూ 10 రోజులు పనులు మానుకొని తిరిగితే కానీ లభ్యం కానీ సర్టిఫికెట్స్ ను వాలంటీర్లు సహకారంతో అందించడం అపూర్వమని.. స్వల్ప కాలంలో ప్రజలకు ఇన్ని వేల సరిఫికేట్స్ రావడానికి సహకరించిన సచివాలయ సిబ్బందికి వాలంటీర్లుకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సభలో వేండ్ర. వెంకటస్వామి, గూడూరి. ఉమాబాల, కానబోయిన. వెంకటరమణ, తోట భోగయ్య, చల్లబోయిన. సూర్య ప్రకాష్, గంటా.సుందర్ కుమార్, కందికట్ల. ఎడ్వర్డ్, Md.భాష, పాలివేలి. మంగ, వేండ్ర విజయ దుర్గ, నాగశ్రీవల్లి, బొక్క గోపి, B. ఏసుబాబు, మరియు వైఎస్ఆర్సిపి నాయకులు, 10వ వార్డ్ సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు గృహసారథులు ప్రజలు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *