సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గం లో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు విరాళంగా ఇచ్చిన 4 ఎకరాల స్థలంలో నిర్మాణం అవుతున్న శ్రీమతి గ్రంధి వెంకటరత్నం, వెంకటేశ్వరరావు ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం 50 పడకల ఏరియా హాస్పిటల్ కు గతంలో ఇచ్చిన 10.15 కోట్లు కాకుండా అదనంగా 100 పడకల ఆసుపత్రి కోసం మరో 28 కోట్లు నిధులను రాష్ట్రంలో జగన్ సర్కార్ మంజూరు చెయ్యడంతో భవన నిర్మాణం పూర్తి చేయుటకు మరియు అదనపు ఆధునికరణ, నూతన నిర్మాణాలు ప్రారంభించుటకు ప్రభుత్వ విఫ్, గ్రంధి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ భీమవరం నియోజకవర్గ ప్రజలతోపాటుగా ఇతర నియోజకవర్గ ప్రజలకు కూడా ఉపయోగపడే విధంగా భీమవరంలో 100 పడకల ఆసుపత్రిని నిర్మించాలని తాను గతంలో ఎమ్మెల్యేగా ఎన్నికైన 2004లో ఆలోచన చేయడం జరిగిందన్నారు. తదుపరి కార్యాచరణ జరిగిన కావలసిన ప్రభుత్వ నిధుల సహకారం మాత్రం ప్రస్తుత సీఎం జగన్ ఆదేశాలతో మాత్రమే జరిగిందని. అతి త్వరలో 100 పడకల ఆసుపత్రి భీమవరం పరిసర ప్రాంత ప్రజలకే కాకుండా పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణ జిల్లా ప్రజలకు కూడా అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులతో పాటు వైసిపి నేతలు విశేషంగా పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *