సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మునిసిపల్ కమిషనర్ ఒక ప్రకటన లో ఈ విధంగా తెలియజేస్తున్నారు. భీమవరం పట్టణ పరిధిలో గల పద్మాలయ థియేటర్ వద్ద గల రాయలం రోడ్డు (డ్రైయిన్) వద్ద గల తూర్పు వైపు ఉన్న ఫ్లాట్ ఫారంపై పై వివిధ రకముల తిను బండారములు విక్రయించుటకు వీధి విక్రయదారుల నుండి భీమవరం పురపాలక సంఘం కార్యాలయంలో ది.08-11-2024 వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ, సదరు దరఖాస్తులు టౌన్ ప్లానింగ్ విభాగం నందు సంప్రదించి వారి నుండి పొందవలసినదిగా తెలియజేయడమైనది. మరిన్ని వివరములు కొరకు భీమవరం పురపాలక సంఘ కార్యాలయం లో టౌన్ ప్లానింగ్ విభాగం వారిని సంప్రదించగలరు అని ఒక ప్రకటనలో తెలిపారు.
