సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురపాలక సంఘ పరిధిలో గల 36, 37 వ వార్డ్ నకు సంబంధించి వాటర్ పిర్యాదు వచ్చిన నేపథ్యంలో దానికి సంబందిచి పైప్ లీక్ ను అజంత కాంటీన్ వద్ద ఉందని రోడ్డు బాగా త్రవ్వి ప్రధాన పైప్ లైన్ కు మరామత్తు పనులను పెద్ద ఎత్తున చేపట్టారు. దీనిని నేడు, సోమవారం మునిసిపల్ కమీషనర్ ఎం.శ్యామల పర్యవేక్షించి పనులు త్వరితంగా క్వాలిటీ తో పూర్తీ కావాలని అధికారులను ఆదేశించారు. భీమవరం 2వ పట్టణ ప్రజలకు సకాలం లో అందరికి నీరు అందెల చర్యలు తీసుకోవాలి అని ఇంజనీరింగ్ సిబ్బంది వారికీ సూచనలుచేసారు. ఇకపై భీమవరం పట్టణ ప్రజలు ఏ విధమైన మున్సిపల్ పరిధిలో ఎటువంటి అవస్థలకు గురి అయిన సరే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కమీషనర్ పిలుపు నిచ్చారు.
