సిగ్మా తెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం 2వ పట్టణంలో ఆధునిక హైటెక్ పద్దతులలో విటులను ఆకర్షిస్తూ వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకురాలిని స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు భీమవరం టూటౌన్ సీఐ కృష్ణకుమార్ ప్రకటించారు. పట్టణంలో ఒక మహిళ విటులకు వాట్సప్ ద్వారా వల వేసి వ్యభిచారం నిర్వహిస్తున్నది. ఇతర ప్రాంతాల నుంచి అందమైన యువతులను తీసుకువచ్చి వాట్సప్‌లో ఫొటోలను విటులకు పంపి వారిని ఆకర్షిస్తున్నది. ఇలా ఆ మహిళ విటుల నుండి వేల రూపాయలు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. గత గురువారం అందిన సమాచారంతో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు దాడి చేసి నిర్వాహకులు, విటుడు, బాధితురాలిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
