సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం 2 టౌన్ లో గత ఆదివారం పట్టపగలు నడిరోడ్డుపై ఒక రౌడీ షీటర్ విజయ్ ను దారుణంగా హత్య ఉదంతం మన సిగ్మా న్యూస్ వీక్షకులకు విదితమే.. దీనిపై భీమవరం టూటౌన్ సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక బలుసుమూడికి చెందిన విజయ్ గత ఏడాది డిసెంబర్ 24న బీసీ కాలనిలో జరిగిన ప్రముఖ రౌడీ షీటర్ ‘రౌతుల ఏసు’ హత్య కేసులో విజయ్ మూడో నిందితుడు. ఆ కేసులో జైలుకు వెళ్లి వచ్చాడు. గత ఆదివారం ఉదయం భీమవరం రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన రౌడీషీటర్ల కౌన్సెలింగ్‌కు విజయ్ అతని సోదరుడు హాజరయ్యారు. అనంతరం ఇద్దరు కలిసి ద్విచక్రవాహనంపై ఇంటికి వెళుతుండగా గొల్లవానితిప్ప రోడ్‌లోని శ్రీ దుర్గాలక్ష్మీ దేవాలయం సమీపానికి వెళ్లేసరికి స్కార్పియో వాహనంపై ఆరుగురు వచ్చి వాళ్ళ ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీకొట్టారు. బైక్ నడుపుతున్న విజయ్ కిందపడిపోవడంతో కత్తులతో తలపై దారుణంగా నరికి హత్య చేశారు.అతని సోదరుడు గోవిందరావు లోసరి పంట కాలువలోకి దూకి పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నాడు. జిల్లా ఎస్పీ రవిప్రకాష్ వచ్చి ఘటన స్థలాన్ని పరిశీలించారు. హత్య చేసినవారిలో శ్యామ్‌కుమార్ కత్తితో పోలీసులకు పట్టుబడగా మిగిలిన ఐదుగురు కిరణ్, సుబ్బు, సాయి, గణేష్, సతీష్‌లు పరారయ్యారు. వారినికూడా అరెస్ట్ చేసి కోర్ట్ ముందు ప్రవేశపెడతామని సి శ్రీనివాస్ అన్నారు. ఈ హత్య పాత కక్షల నేపథ్యంలోనే జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.
