సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో నేడు, గురువారం ఉదయం కూటమి బలపరచిన జనసేన అభ్యర్థి పులపర్తి అంజిబాబు స్థానిక 23,24,25 వార్డులను ప్రజలను టీ గ్లాస్ గుర్తు ఫై ఓట్లు వేసి గెలించాలని అభ్యర్ధించారు.పలువురు మహిళలు ఆయనకు హారతులు పట్టారు. సూపర్ 6 తో పాటు తాజా మ్యానిపెస్టోలో అనేక ప్రజా సంక్షేమ పధకాలు చంద్రబాబు, పవన్ , బీజేపీ కలసి ప్రకటించాయని మహిళలకు బస్సు ప్రయాణం ఉచితం అని,వంట గ్యాస్ సిలెండర్లు 3 ఉచితంగా వస్తాయని, బిసిలకు 50 ఏళ్లకే పింఛన్ లు వస్తాయని,ఎస్సీ ఎస్టీలకు మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయని నియోజకవర్గంలో శాంతి యుత పాలనతో పాటు అభివృద్ధి పనులు చేపడతానని వివరిస్తూ ఆయన ప్రచారం చేసారు.స్థానిక అంబెడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ కౌన్సెలర్స్ సుబ్బారావు, ఐజాక్ బాబులతో పాటు పలువురు జనసేన నేతలు పాల్గొన్నారు.
