సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురపాలక సంఘ పరిధి స్థానిక వన్ టౌన్ లోని 26వ వార్డు గంగానమ్మ తల్లి గుడి వైపు నూతనంగా నిర్మిస్తున్న సిసి రోడ్డు పెద్ద ఎత్తున పని జరుగుచున్నందున సదరు రోడ్డు యందు రాక పోకలను ఒక నెల కాలము వరకు నిలిపివేయడమైనది. కావున వార్డు ప్రజలు, వాహన చోదకులు, ప్రయాణీకులు, వార్డు ప్రజలు సహకరించ వలసినదిగా మునిసిపల్ కమిషనర్ రామచంద్ర రెడ్డి ఒక ప్రకటనలో కోరారు.
