సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం 29వ వార్డులో నేడు, శుక్రవారం సాయంత్రం వైసిపి నేతలు ‘జగన్ మళ్లీ ఎందుకు కావాలి ‘అనే కార్యక్రమం 2టౌన్ పార్టీ ఇంచార్జి గాదిరాజు సుబ్రహ్మణ్యం రాజు అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలోనే రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ కామన నాగేశ్వరరావు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కోడే యుగంధర్ అన్నారు. వార్డ్ ఇంచార్జ్ పిప్పళ్ళ నాని ఆధ్వర్యంలో సభ జరిగింది. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సభలో రేవూరి గోగురాజు, ఇంటి సత్యనారాయణ, గంటా సుందర్ కుమార్, చెల్లబోయిన సూర్య ప్రకాష్, కానబోయిన వెంకటరమణ, అల్లూరి శ్రీనాగవల్లి, K విజయదుర్గ, చెన్ను చంటి, ముత్యాల బుజ్జి, మెట్ట మురళి, బొర్రా వాసు, నాగిడి విజయలక్ష్మి, బాల పరమేశ్వరరావు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
