సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో నేడు సోమవారం నియోజకవర్గ ఇన్చార్జి పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మీ అధ్యక్షతన మండల పట్టణ అధ్యక్ష కార్యదర్శుల ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించారు.ఆమె మాట్లాడుతూ .. అన్నదాత సుఖీభవ పథకంతో రాష్ట్రంలో రైతులు ఆనందం సంతోషంతో ఉన్న సందర్భంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న రైతు సంబరాలలో భాగంగా భీమవరం పట్టణములో 13వ తేదీ బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు భీమవరం లూధరన్ హై స్కూల్ గ్రౌండ్స్ వద్ద నుండి ట్రాక్టర్ల ర్యాలీతో బయలుదేరి భీమవరం వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ ఆవరణలో రైతు సంబరాల సభను నిర్వహించనున్నామని తెలిపారు. ఈసభకు కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు కోటికలపూడి గోవిందరావు ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొంటారని తెలిపారు. టిడిపి రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, కీలక టీడీపీ నేతలు కోళ్ల నాగేశ్వరరావు వెండ్ర శ్రీనివాస్ ,ఇందుకురి రామలింగరాజు, కలిదిండి రామచంద్రరాజు,కొల్లేపర శ్రీనివాస్ మద్దుల రాము కొయ్యలగడ్డ గణపతి కార్యదర్శులు వీరవల్లి శ్రీనివాస్ చల్లబోయిన గోవింద్ కోళ్ల సీతారాం, ఉప్పులూరి చంద్రశేఖర్ పడమట సోమేశ్వరరావు యలమంచిలి శ్రీనివాస్ గూడూరి సుబ్బారావు నేదునూరి గంగాధర్ తిలక్ తదితర నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *