సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మార్కెట్ యార్డ్ చైర్మెన్ లు ను గతంలో ప్రకటించినప్పటికీ కూటమి నేతల మధ్య అనేక అభ్యన్తరాలు వివాదాల మధ్య ఎట్టకేలకు ఆలస్యం అయినప్పటికీ పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతిష్టాకరమైన భీమవరం, పెనుగొండ వ్యవసాయ మార్కెట్ కమిటీలకు పాలకవర్గాలను ఖరారు చేస్తూ ప్రభుత్వం తాజగా ఉత్తర్వులు జారీ చేసింది. భీమవరం ఏఎంసీ గౌరవ చైర్మన్‌గా స్థానిక ఎమ్మెల్యే పులపర్తి అంజి బాబు, చైర్మన్‌గా కలిదిండి సుజాత, వైస్ చైర్మన్‌గా బండి రమేష్‌కుమార్, డైరెక్టర్‌లు గా మైగాపుల గంగారావు, రొంగల కృష్ణ వేణి, గూడూరి దేవిజ్యోతి, ఎద్దు కంఠ మణి, బండి రాజేష్, మోకా శ్రీను, నేల పాటి ఆంబోజి, యర్రంశెట్టి సత్యవీర బ్రహ్మం, యిర్రింకి సుధా రత్నకుమారి, కిల్లంపూడి రమాదేవి, మహమ్మద్ ఖలీల్, యాతం నాగలక్ష్మిలను నియమించారు. ఇక పెనుగొండ మార్కెట్ కమిటీకి చైర్మన్‌గా బడేటి వీరబ్రహ్మం, వైస్ చైర్మన్‌గా శీలం బాబి భాస్కర్, డైరెక్టర్‌లు గా బొరుసు దుర్గా కల్యాణి, చింతపల్లి జేమ్స్, చిట్టూరి మంగ, దాసరి శ్రీనివాస్, తదితర కూటమి నేతలను నియమించారు.
