సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ స్థల మార్పు ప్రచారంపై నేడు, బుధవారం అఖిల పక్ష పార్టీల నేతలు రాష్ట్ర శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజును కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి జే.ఎన్.వి. గోపాలన్ మాట్లాడుతూ .. ప్రభుత్వ మారిన తర్వాత కలెక్టరేట్ స్థలం మార్పుపై మీడియాలో, సోషల్ మీడియాలో విస్తృతమైన ప్రచారం జరుగుతుందని తెలిపారు. ప్రజలందరూ గందరగోళానికి గురవుతున్నారని అన్నారు. దీనిపై సిపిఎం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించామని గుర్తు చేశారు. ఈ విషయమై గత మంగళవారం రాత్రి స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులును కలిశామని చెప్పారు. కలెక్టరేట్ భీమవరంలోనే ఉంటుందని స్పష్టం చేశారని తెలిపారు. అయితే ఇకపై గత ప్రభుత్వ జీవో ప్రకారం అందరికి అందుబాటులో స్థానిక మార్కెట్ యార్డులోనే 20 ఎకరాల స్థలంలో జిల్లా కలెక్టరేట్ పర్మినెంట్ భవనములను నిర్మించేలా కృషి చెయ్యాలని రాష్ట్ర శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు ను అఖిల పక్ష పార్టీలు, ప్రజా సంఘాల నేతలు కోరారు. అనంతరం మండలి చైర్మన్, మోషేన్ రాజు మాట్లాడుతూ .. జిల్లా ప్రజలందరికీ అందుబాటులో ఉండేలాగ మార్కెట్ యార్డులోనే అనువైన స్థలమన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన జీవ ఆధారంగా సొంత భవనాలు నిర్మించడానికి ఈ సమస్యను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తానని ఆయన తెలిపారు.
