సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు వారి బందువులకు కూడా ప్రతి రోజు ఉచిత భోజన ఏర్పాట్లు చేస్తున్న శ్రీ సత్య సాయి అన్నపూర్ణ సేవ ఫౌండేషన్ నిర్వాహకులు రాయప్రోలు చలపతి రావు ఆధ్వర్యంలో నేడు, గురువారం ఉదయం స్థానిక ఆర్ట్ సెంటర్ లో వైద్య అధికారి డాక్టర్ గోవిందా బాబు పర్యవేక్షణలో ఎయిడ్స్ వ్యాధి బారి పడి ప్రాణాలు కోల్పోయిన తల్లి తండ్రులను కోల్పోయిన పిల్లలకు మంచి పౌష్ఠిక ఆహారం అందించే ఉద్దేశ్యంతో వారికీ పలు రకాల పప్పు దినుసులు, ఆయిల్ పాకెట్స్ , బియ్యం పంపిణి ని నిర్వహించారు. ఆసుపత్రి సూపర్ డెంట్ వీరాస్వామి ఇతర వైద్యుల అనుమతి ,సహకారంతో చాల కాలంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతిరోజూ అన్న సమారాధన చేస్తున్న శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ఫౌండేషన్ నిర్వాహకులు అభినందనీయులు అని, ఇక్కడ సెంటర్ నిర్వాహకుడుగా తన కోరిక మన్నించి వందలాది అనాధలయిన బాలలకు పౌష్ఠిక ఆహారం ఇచ్చినందుకు కృతజ్ఞలు తెలిపారు. ఈ కార్యక్రమం లో పాల్గొన్న ఆసుపత్రి అధికారులు, రాయప్రోలు చలపతిరావు సేవలు అందరికి ఆదర్శం అని, అని అలాగే ఎయిడ్స్ వ్యాధి పడిన చిన్నారుల ఆరోగ్యం పట్ల పట్ల ఎంతో కరుణతో బాధ్యతలు నిర్వహిస్తున్న వై ఆర్ జి కేర్ సెంటర్లో న్యూట్రీషియన్ టీ శేషారాజ్యం చేస్తున్న సేవలను అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *