సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా భీమవరం ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఉన్న ART సెంటర్ మరియు మండల న్యాయ సేవా సంస్థ ఉమ్మడి ఆధ్వర్యంలో ఎయిడ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ART సెంటర్ అధికారి, డాక్టర్ M.గోవిందబాబు మాట్లాడుతూ.. “HIV సోకకుండా అవగాహన కలిగి ఉండి జాగ్రత్తలు పాటించాలని, వ్యాధిగ్రస్తులు అధైర్య పడకుండా ART సెంటర్ ద్వారా మందులు సకాలంలో వాడి పౌష్టికాహారం తీసుకుంటే వ్యాధిని జయించవచ్చని” అన్నారు. ప్యానల్ న్యాయవాది N. సుధీర్ మాట్లాడుతూ.. “HIV వ్యాధిగ్రస్తులకు న్యాయపరమైన సహాయం అవసరమైతే కోర్టు ఆవరణలో ఉన్న మండల న్యాయ సేవా సంస్థ ను సంప్రదిస్తే ఉచిత న్యాయ సహాయం అందజేస్తామని” అన్నారు. అనంతరం ART సెంటర్ ద్వారా వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం అందజేసారు. ఈ కార్యక్రమంలో ప్యానల్ న్యాయవాదులు P.అంబేద్కర్, K.జ్యోతి, Y.చిన్నారెడ్డి, ART సెంటర్ కార్యకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు.
