సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం స్థానిక D.N.R కళాశాలలో సామాజిక సమతా సంకల్పం కార్యక్రమమును కళాశాలల కమీషనర్ ఆదేశాలమేరకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమములో కళాశాల వైస్ ప్రెసిడెంట్ గోకరాజు పాండు రంగ రాజు మాట్లాడుతూ… అంబేడ్కర్ ఆశయాలు, లక్ష్యాలకు అనుగుణంగా విద్యార్థులు నడుచుకోవాలని, విద్యార్థులు క్రమశిక్షణతో ఉండాలని తెలియచేశారు. ఈ కార్యక్రమములో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్.B.S.శాంతకుమారి మాట్లాడుతూ .. రేపు విజయవాడలో స్వరాజ్ మైదానంలో జరిగే అంబేడ్కర్ విగ్రావిష్కరణను గుర్తుచేశారు.అంబేడ్కర్ యొక్క గొప్పతనమును ఆయన కష్టాలను విధ్యార్తులకు తెలియచేశారు. ఈ కార్యక్రమములో వివిధ శాఖల అధిపతులు అధ్యా పక, అధ్యాపకేతర సిబ్బంది N.C.C,NSS, ఆపీసర్స్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *