సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం దంతులూరి నారాయణరాజు కళాశాల (DNR ) కు దశాబ్దాలుగా సుదీర్ఘ చరిత్ర ఉంది. ఇప్పటి కార్పొరేట్ కాలేజీలలో దూకుడు లో సైతం తమ కాలేజీ లో చదివే ఇంటర్ డిగ్రీ పిజి, లా, ఇంజనీరింగ్ తదితర కొర్స్ లు చదివే వేలాది మంది విద్యార్థులకు దశాబ్దాలుగా భోరోసా గా ఉంది. సుదీర్ఘ కాలంగా అటానమస్ హోదాలో గర్వముగా నిలబడింది. ఇక్కడ డిగ్రీ పూర్తీ చేసిన విద్యార్థులకు అందరికి 100 శాతం ఉద్యోగ కల్పన చేస్తున్న ఏకైక కాలేజీ గా ఖ్యాతి గాంచింది. మరి ఇటువంటి కాలేజీలో డిగ్రీ విభాగానికి ప్రిన్సిపాల్ గా పనిచేసిన డా.బి.యస్.శాంతకుమారి పదవి విరమణ చెయ్యడంతో కళాశాల పాలకవర్గం నేడు, శనివారం కళాశాల ప్లాటినం జూబ్లీ హాల్ లో అధ్యాపక సిబ్బంది సమక్షంలో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాలక వర్గం కార్యదర్శి గాదిరాజు బాబు మరియు వైస్ ప్రసిడెంట్ గోకరాజు పాండురంగ రాజు ఇతర సభ్యులు మాట్లాడుతూ.. దేశ విదేశాలలో పారిశ్రామిక, సాంకేతిక , విద్య, సినీ రంగాలలో ఎంతో మంది ప్రముఖులను మేధావులను తయారు చేసిన పుణ్య భూమి లాంటి దంతులూరి నారాయణరాజు కళాశాల లో చదువుకొని అదే కాలేజీలో సోషల్ లెచ్చలర్ గా 4 దశాబ్దాలుగా పనిచేస్తూ కళాశాల అభ్యున్నతిలో భాగస్వామిగా సుదీర్ఘ కాలం ప్రిన్సిపాల్ గా పనిచేసిన డా.బి.యస్.శాంతకుమారికి వీడ్కోలు పలకడం కాస్త బాధాకరంగా ఉన్నపటికీ,ఎంతో సహనంతో సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించిన ఆమెను చూసి గర్విస్తున్నామని ఇకపై ఆమె ప్రశాంత జీవితం గడపాలని ఆమె సేవలను మరచిపోమన్నారు. డా.బి.యస్.శాంతకుమారి కాలేజీలో తన అనుభవనాలను పంచుకొని తనను ఆదరించిన అందరికి కృతఙ్ఞతలు తెలిపారు.
